మరో చిత్రం చెయ్యబోతున్న గోపీచంద్ మరియు రవితేజ

తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రవితేజ సమయం వృధా చేయ్యదలుచుకోవట్లేదనిపిస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ “దేవుడు చేసిన మనుషులు” చిత్రంలో నటిస్తున్న ఈయన ఈ చిత్రం తరువాత పరుశురాం చిత్రంలో నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా మెహర్ రమేష్ తో ఒక చిత్రం ఒప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ గోపీచంద్ మలినేనితో తిరిగి జత కట్టబోతున్నారు. గతంలో వీరు ఇరువురు కలిసి “డాన్ శీను” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. ఈ నూతన చిత్రాన్ని పివిపి బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లురి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత తమిళ “ఈగ( నాన్ ఈ) ” చిత్రం , సెల్వ రాఘవన్ దర్శకత్వం లో “బృందావనం లో నందకుమారుడు” మరియు కమల్ హాసన్ “విశ్వ రూపం” చిత్రాలను నిర్మిస్తున్నారు. కోన వెంకట్ ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ ” బ్యాంకాక్ లో రవితేజకి ఒక కథ చెప్పాము ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నారు ప్రసాద్ నిర్మించబోతున్నారు” అని చెప్పారు. త్వరలో చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

Exit mobile version