ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మరియు బాలివుడ్ లో ఒకేసారి చిత్రాలు చేస్తున్న ఒకే ఒక కథానాయకుడు రానా. వెంకటేష్ కి కొడుకు వరస అయ్యే ఈ నటుడు ఒకానొక ప్రముక దిన పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో “మీరు బొబ్బిలి రాజా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి” అన్న ప్రశ్న కు. “అదేం లేదు అది ఎవరు సృష్టించిన కథ బాబాయి అంత బాగా చేసిన పాత్రను నేను చేసి చెడగొట్టడం అవసరమా” అని అన్నారు. వెంకటేష్ తో కలిసి చిత్రం ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రశ్న కు మంచి కథ దొరికితే తప్పకుండ చేస్తాను అని చెప్పారు. నా ఇష్టం చిత్రం గురించి చెబుతూ ” నా తర్వాతే ఈ ప్రపంచం అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. ఓ రకంగా సెల్ఫిష్ అన్నమాట. ఈ సినిమాలో జెనీలియా పేరు కృష్ణవేణి. చాలా నెమ్మదస్తురాలు. కథ అంతా మలేసియాలో సాగుతుంది” అని చెప్పారు. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించారు ఈ చిత్రం వచ్చే నెల లో విడుదల కానుంది. ఈ చిత్రం కాకుండా ప్రస్తుతం రానా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో “డిపార్టుమెంటు” చిత్రం లో నటిస్తున్నారు. తరువాత క్రిష్ దర్శకత్వం లో “కృష్ణం వందే జగద్గురు” చిత్రం లో నటిస్తున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వం లో కూడా ఒక చిత్రం ఈ ఏడాది మొదలు కానుంది.