రామానాయుడు చేతుల మీదుగా ‘3’ ఆడియో విడుదల

ధనుష్, శృతి హసన్ జంటగా నటించిన ‘3’ చిత్ర ఆడియో ప్రముఖ తాజ్ డెక్కన్ హోటల్లో జరగింది. ‘కొలవేరి’ సంచలనం అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకి మూవీ మొఘల్ రామానాయుడు, విజయేంద్ర ప్రసాద్, నటుడు రాజశేఖర్, జీవిత, శ్రీహరి, రానా, ధనుష్, ఐశ్వర్య, అనిరుద్, వీరభద్రమ్, నట్టి కుమార్ హాజరయ్యారు. రామానాయుడు గారు ఈ చిత్ర ఆడియోని విడుదల చేసి రాజేశేఖర్ కి ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ధనుష్ ఒకప్పుడు తమిళ్ హీరోగా మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు వరల్డ్ ఫేమస్ హీరో ఐపోయాడు. ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. రానా మాట్లాడుతూ ఈ సినిమా తమిళ్ కంటె తెలుగులో పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ మనలో ఉండే మైనస్ పాయింట్స్ మన దగ్గరి వాళ్ళకి బాగా తెలుస్తాయి. నా సినిమాలకి జీవిత డైరెక్ట్ చేసారు, అలాగే ఈ సినిమాకి ధనుష్ భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేసారు. ఈ వేడుకకి హాజరైన అతిధులు అందరూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.

Exit mobile version