బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్

Published on Feb 19, 2012 3:47 PM IST

బొమ్మరిల్లు భాస్కర్ తన సినిమాలో హీరో కోసం వెతుకులాట పూర్తయింది. తను డైరెక్ట్ చేయబోయే తరువాతి సినిమాలో రామ్ హీరో. ఆయన గతంలో రామ్ చరణ్ తో తీసిన ‘ఆరంజ్’ సినిమా పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ తమిళ హీరోకి ఈ స్క్రిప్ట్ వినిపించగా ఆయన మొదట్లో సముఖత వ్యక్తం చేసినా అది కార్య రూపం దాల్చలేదు. ఆ తరువాత అల్లు అర్జున్ ని కూడా కలవడం జరిగింది. ఆయన త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటం వాసు వర్మతో మరియు సురేందర్ రెడ్డి లతో చిత్రాలు అంగీకరించి ఉండటంతో కుదరలేదు. చివరగా రామ్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించగా ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి సమాచారం త్వరలో అధికారికంగా తెలపనున్నారు.

తాజా వార్తలు