మెగా స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్లో కూడా కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో రామ్ చరణ్ కొత్త స్నేహితుడు మరెవరో కాదు దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్. రామ్ చరణ్ ‘జంజీర్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కోసం రామ్ చరణ్ ముంబైలో ఉంటున్నాడు. రామ్ చరణ్ కోసం సల్మాన్ ఖాన్ ఒక బిర్యాని ప్యాకెట్ పంపాడట. సల్మాన్ గత వారం తన ఇంటికి డిన్నర్ చేయమని కూడా పిలిచాడట. రామ్ చరణ్ బాలీవుడ్ వెళ్లి అక్కడ హీరోలతో స్నేహం పెంచుకోవడం మంచి తరునమనే చెప్పుకోవాలి.