మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వివి వినాయక డైరెక్షన్లో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమర్షియల్ మసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించబోతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ ద్విపాత్రాబినయం చేయనున్నట్లు సమాచారం. శరవేగంగా సింగిల్ షెడ్యుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్ర నిర్మాత.