కొచ్చాడియన్ చిత్రం కోసం పాట పాడిన రజినికాంత్

తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ తన రాబోతున్న మాయాజాలం “కొచ్చాడియన్” చిత్రం లో ఒక పాట పాడారు. ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ఈ పాటకు సాహిత్యం అందించారు. మార్చ్ 11న ఈ పాటను రికార్డ్ చేశారు. సంగీత మాయాజాలికుడు ఏ ఆర్ రెహ్మాన్ , చిత్ర దర్శకురాలు సౌందర్య మరియు వైరముత్తు ఈ రికార్డింగ్ లో పాల్గొన్నారు. ఇరవై ఏళ్లలో రజినీకాంత్ పాట పాడటం ఇదే మొదటి సారి. గతం లో 1992 లో “మన్నన్” అనే చిత్రం లో ఒక పాటకు రజిని కాంత్ తన స్వరాన్ని అందించారు. మార్చ్ 21 నుండి లండన్ లో జరగనున్న చిత్రీకరణలో పాల్గొననున్నారు మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం రజినీకాంత్ ఈ చిత్రం గురించి చాలా నమ్మకం గా ఉన్నారు. సౌందర్య.ఆర్.అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ లుల్ల నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ మరియు ఒచేర్ పిక్చర్ ప్రొడక్షన్స్ సహా నిర్మాణం అందిస్తున్నారు. దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గతం లో రజిని కాంత్ అల్లుడు ధనుష్ స్వరం లో వచ్చిన పాట “వై దిస్ కొలవేరి” ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట ఏం చేస్తుందో వేచి చూడాలి.

Exit mobile version