రచ్చ ఏప్రిల్ 5న విడుదల కాబోతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతుందా? అవుననే అంటున్నాయి యూనిట్ వర్గాలు. ఇటీవల ‘డిల్లకు డిల్లకు’ పాట చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ గాయపడిన విషయం మనకందరికీ తెలిసిందే. డిల్లకు డిల్లకు పాట కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా మరో పాట చిత్రీకరణ పూర్తిగా మిగిలి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాలు మాత్రం రచ్చ ఏప్రిల్ 5న భారీ విడుదలకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. రామ్ చరణ్ సరసన వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన రచ్చ తమిళ్లో రాగలై పేరుతో మలయాళంలో రక్షా పేరుతో విడుదల కాబోతున్నాయి.

Exit mobile version