రామ్ చరణ్ తేజ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “రచ్చ” ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని అడ్డంకులను దాటుకొని ఈ చిత్రం విడుదలకు సిద్దమయ్యింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలయిన సంగీతం విజయం సాదించింది ప్రత్యేకంగా “వాన వాన వెల్లువాయే” పాట గ్యాంగ్ లీడర్ రీమిక్స్ పాట అయిన ఈ పాట యువతను ఉర్రూతలూగిస్తుంది. దేవ్ గిల్ మరియు అజ్మల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళం మరిఉ మలయాళంలో కూడా విడుదల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న తెలుగులో విడుదల అవుతుంది.