భారి బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న “రచ్చ”

భారి బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న “రచ్చ”

Published on Feb 20, 2012 9:28 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం “రచ్చ” ఈ వేసవికి విడుదల అవ్వటానికి సకలం సిద్దమయ్యింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర బడ్జెట్ రామ్ చరణ్ పారితోషకం కాకుండా 29కోట్లు అయినట్టు సమాచారం ఇంకా ఇందులో రామ్ చరణ్ పారితోషకం కూడా జమ చేస్తే ఇది ఇంకా పెరిగుతుంది అద్బుతమయిన ప్రదేశాలలో మరియు అద్బుతమయిన పోరాట సన్నివేశాలను ఇందులో ఉంచారు. ఇందులో పోరాట సన్నివేశాలు అందరిని ఆశ్చర్య పరుస్తాయని ముందు నుండి చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అంతా అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద అద్బుతమయిన కల్లెక్షన్స్ సృష్టించనుంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించగా మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు నిర్మిస్తున్నారు

తాజా వార్తలు