సీనియర్ నిర్మాత పర్వతనేని మల్లిఖార్జున రావు (76)ఈ రోజు మెడ్విన్ హాస్పటిల్ లో మరణించారు. ఆయన తెలుగు, హిందీ బాషల్లో అనేక హిట్ సినిమాలు నిర్మించారు.ఆయన గతంలో కాంతారావు హీరోగా జ్వాలాద్వీప రహస్యం , ఇద్దరు మొనగాళ్లు,అక్కినేనితో మంచి కుటుంబం, శోభన్ బాబుతో మంచి మిత్రులు, ఇంటి గౌరవం, కృష్ణతో నేనంటే నేనే వంటి అనేక చిత్రాలు నిర్మించారు.
ఆయన హిందీలోనూ జితేంద్ర హీరోగా హిమ్మత్ ,ధర్మేంద్రతో కిమ్మత్,గుల్జార్ దర్సకత్వంలో మౌసమ్,కె విశ్వనాధ్ దర్శకత్వంలో సంజోగ్, ఈశ్వర్ చిత్రాలు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు,భార్య ఉన్నారు. 1935 జూలై 27 న ఈయన కృష్ణ జిల్లా లో జన్మించారు.