విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరువాతి చిత్రం ‘ధోని’ ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది. పాండిచ్చేరి, హైదరాబదులో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో అగ్ర దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్, ప్రకాష్ రాజ్ మరియు రాధిక ఆప్టే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తన కొడుకుని ఉన్నత చదువులు చదివించాలని తపన పడితే తన కొడుకు మాత్రం పెద్ద క్రికెటర్ కావాలనుకుంటాడు. ఈ చిత్ర కథను సినిమాలో స్వయంగా ధోనినే వివరించబోతున్నాడు. ప్రకాష్ రాజ్ డైరెక్షన్ కూడా చేస్తూ స్వయంగా తనే నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’