చివరి దశకు చేసృకున్న రెబల్ షూటింగ్

చివరి దశకు చేసృకున్న రెబల్ షూటింగ్

Published on Feb 20, 2012 10:56 AM IST

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘రెబల్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చివరి షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 23 వరకు అక్కడే చిత్రీకరిస్తారు. ఆ తరువాత శంషాబాద్లోని గుడి పరిసర ప్రాంతాల్లో మార్చి 12 వరకు చిత్రీకరించి షూటింగ్ పూర్తి చేస్తారు. తమన్నా మరియు దీక్ష సేథ్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రానికి లారెన్స్ డైరెక్టర్. కె. భగవాన్ మరియు జే. పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే నెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెబల్ చిత్రానికి లారెన్స్ డైరెక్షన్ తో పాటు సంగీతం కూడా అందిస్తుండటం విశేషం.

తాజా వార్తలు