పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం లో ని టైటిల్ సాంగ్ కు విడుదల ముందు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాట ని చిత్రం లో ఆఖరు లో క్లైమక్ష్ తరువాత పెట్టటం తో సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇంత మంచి పాట ని చిత్రం అయిపోయాక పెట్టటం ఏంటి అని చాల మంది అన్నారు.
దీనితో చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఈ పాట ను చిత్రం లో ముందు కు తీసుకువస్తున్నారు. కచ్చితం గా ఎక్కడ పెడతారు పాట ని అనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే వార్త.