‘జాక్’ నుంచి ‘పాబ్లో నెరుడా’ సాంగ్ రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్ – కొంచెం క్రాక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘పాబ్లో నెరుడా’ రిలీజ్ చేశారు మేకర్స్. స్పానిష్ కవి అయిన ‘పాబ్లో నెరుడా’ పేరుతో సాగే ఈ పాటకు వనమాలి చక్కటి లిరిక్స్ అందించగా.. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సంగీత దర్శకుడు అచు రాజమణి క్యాచీ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటలో సిద్ధు చాలా స్టైలిష్ లుక్స్‌తో పాటు కూల్ యాటిట్యూడ్‌తో డ్యాన్స్ స్టెప్పులు కూడా వేశాడు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఈ సినిమాలో ‘బేబీ’ చిత్ర బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version