గేయ రచయితగా మారిన నితిన్

గేయ రచయితగా మారిన నితిన్

Published on Dec 30, 2011 3:05 PM IST

నితిన్ రాబోయే చిత్రం “ఇష్క్” లో కొత్త అవతారం ఎత్తాడు. అందులో “లచ్చమ్మ” అనే పాటను కృష్ణ చైతన్య తో కలిసి రచించాడు. ఈరోజు ఉదయం ఈ పాటను ట్విట్టర్ లో విడుదల చేసాడు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నితిన్ మరియు నిత్య మీనన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా పి సి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల కావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు