తన ముందు నేను పనిమనిషిలా అనిపించాను – నతాలియా కౌర్

తన ముందు నేను పనిమనిషిలా అనిపించాను – నతాలియా కౌర్

Published on Mar 30, 2012 3:00 AM IST

ఈ మధ్య కాలం లో బాగా వినిపించిన పేరు నతాలియా కౌర్. రామ్ గోపాల్ వర్మ చిత్రం కోసం రానా తో కలిసి చేసిన ఫోటోషూట్ ఈ భామ గురించి పరిశ్రమ మాట్లడుకునేల చేసింది.ఈ ఫోటోషూట్ గురించి ఒకానొక జాతీయ పత్రికతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కోరిన విధానంగా ఫోటోలకు పోజ్ లు ఇచ్చాం షూట్ అయిపోయిన వెంటనే రానా తన వ్యాన్ లోకి వెళ్ళిపోయేవాడు. తను షర్టు వేసుకొని వస్తుంటే తన ముందు నేను ఒక పని మనిషి లా అనిపించేదానిని రానా చాలా మంచి మనిషి తనకు అద్బుతమయిన ఆహార్యం ఉంది అందువలనే ఫోటోలు అంత బాగా వచ్చాయి అని చెప్పారు. రానా మరియు నతాలియా కౌర్ లతో రామ్ గోపాల్ వర్మ ఒక థ్రిల్లర్ తీయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు. అవకాశమొస్తే ఐటెం సాంగ్ లో చెయ్యటానికి సిద్దమని నతాలియా కౌర్ తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు. ఇంకా మన పరిశ్రమలో ఆమెకు అవకాశాలు రావటం సులభమే అని తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు