రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “నా ఇష్టం”. ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.కాని ఈ చిత్రం నిర్మాతలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేలా కనిపిస్తుంది. విడుదల అయిన మూడు రోజుల్లో మూడు కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం షుమాకర్ కి నిజాం లో 92 లక్షలను వసూలు చేసింది మరో 1.2 కోటి దాకా వసూలు చేయనున్నాయని సిని పండితులు అంటున్నారు. దీనికి శాటిలైట్ హక్కులను కూడా జత చేస్తే ఈ చిత్రానికి మరో మూడు కోట్లు చేరుతాయి ఈ లెక్కలన్నీ చూస్తుంటే 8.5 కోట్లతో చిన్న బడ్జెట్ చిత్రంగా నిర్మించబడ్డ ఈ చిత్రం నిర్మాతలను సురక్షితంగా ఒడ్డుకి చేర్చినట్టే కనిపిస్తుంది. జెనిలియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకత్వం వహించారు. గతంలో బాలకృష్ణ “సింహ” చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు.