యంగ్ హంక్ రానా మరియు స్వీట్ బాబ్లీ గర్ల్ జెనిలియా జంటగా కనిపించబోతున్న చిత్రం “నా ఇష్టం”. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్ర ఆడియో విజయోత్సవం ఈరోజు హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి రానాతో పాటు జెనిలియా కూడా హాజరయ్యింది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని జనం బాగా ఆదరించారని నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు. ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు