చిరు – బాలయ్యల గొడవను కొట్టిపారేసిన మురళీమోహన్

చిరు – బాలయ్యల గొడవను కొట్టిపారేసిన మురళీమోహన్

Published on Jan 26, 2012 4:28 PM IST

బాలయ్య మరియు చిరంజీవి ల మధ్య గొడవను మా అధ్యక్షుడు మురళి మోహన్ కొట్టిపారేశారు. ఈ తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం లో మాట్లాడుతూ వాళ్ళు వారి పార్టీ కోసం ఇలా మాట్లాడుతున్నారు కాని నిజానికి వారు బయట మంచి స్నేహితులు గానే ఉంటారు. అభిమానులకి మీడియా వారికి ఇది రాజకీయ గొడవ గానే ఉంచమని కోరారు దీన్ని రాజకీయ గొడవగానే చూస్తే మంచిది అని చెప్పారు గతం లో ఎన్టీయార్ గారిక్ మరియు కృష్ణ గారికి కూడా ఇలాంటి రాజకీయ గొడవలు ఉండేవి కాని ఎప్పుడు వ్యక్తిగతంగా ఏమి అనుకోలేదు. ఈ గొడవ పరిశ్రమ మీద ఏదయినా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నని కూడా కొట్టిపారేశారు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలకి సంబంధం లేదు చిత్ర పరిశ్రమ పని ప్రజలని సంతోష పరచడానికే అని చెప్పారు.

తాజా వార్తలు