ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకుంటున్న మహేష్ బాబు

ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకుంటున్న మహేష్ బాబు

Published on Mar 28, 2012 11:31 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన సింగపూర్ ఎంచుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 10 రోజుల పాటు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న ఆయన వరుస షూటింగ్ లతో బ్రేక్ తీసుకోవాలని ఈ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించే మహేష్ బాబు త్వరలో సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో కూడా పాల్గొననున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు సరసన సమంతా నటిస్తుండగా, సుకుమార్ డైరెక్షన్లో రానున్న సినిమాకి మాత్రం హీరొయిన్ ఎవరన్నది ఇంకా ధ్రువీకరించలేదు.

తాజా వార్తలు