
రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తరువాత ఎలాంటి స్క్రిప్టులు ఎంచుకోవాలనే విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తుంది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వూలో మాట్లాడుతూ ఇప్పటినుండి నేను చేయబోయే ప్రతి సినిమా పై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నాపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్క్రిప్ట్ ఎంచుకునే చాలా జాగ్రత్త వహించాలనుకుంటున్నాను. ‘బిజినెస్ మేన్’ స్టొరీ లైన్ వినకుండానే ఆ ప్రాజెక్ట్ అంగీకరించినట్లుగా మహేష్ చెప్పారు. పూరీ జగన్నాధ్ ను గుడ్డిగా నమ్మేసాను, సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ముందే కలిగిందని చెప్పారు. ‘పోకిరి’ స్క్రిప్ట్ అంగీకరించేముందు కొంత భయం ఉండేది వర్కవుట్ అవుతుందా కాదా అని, ‘ఖలేజా’ స్క్రిప్ట్ మీద చాలా నమ్మకం ఉంది అంగీకరించాను అన్నారు. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో పొగ తాగడం మానేసినట్లు కూడా చెప్పారు. ఈ మద్య ఫ్యామిలీతో బాగా సమయం గడుపుతున్నట్లు ‘గాడ్ ఫాదర్’ సినిమా తన ఫేవరేట్ సినిమా అని కూడా చెప్పారు.

