రానా మరియు నయనతారలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” రెండవ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో మొదలయ్యింది గత కొన్ని రోజులుగా రానా “డిపార్ట్ మెంట్” చిత్ర ప్రచారం రానా పాల్గొన్నారు. ఆ చిత్రం విడుదలయిన కారణంగా తెలుగులో తరువాతి చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు.”ఇప్పుడే మొదటి రోజు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాను ” అని రానా తన ట్విట్టర్ లో చెప్పారు. ఈ చిత్రం రానా కెరీర్ లో తొలి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి బాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు, ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.