పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్దం చేసుకున్న కోన వెంకట్

పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్దం చేసుకున్న కోన వెంకట్

Published on May 24, 2012 2:35 AM IST

కోన వెంకర్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఈయనకు “తొలి ప్రేమ” చిత్రం నుండి పవన్ కళ్యాణ్ తో మంచి స్నేహబంధం ఉంది. పవన్ కళ్యాణ్ తనకి సోదరుడి వంటి వాడని అంటుంటారు. గత కొన్ని రోజులుగా ఈ రచయిత పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు త్వరలో ఈ కథను పవన్ కి వినిపిస్తారు. ” నేను న కథతో సిద్దంగా ఉన్నాను ఆయనకీ వినిపించాలి ప్రస్తుతం ఆయన “గబ్బర్ సింగ్” చిత్రంతో బిజీగా ఉన్నారు ఆయనకీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను” అని మార్చ్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. “నాకు శ్రీను వైట్ల పవన్ కళ్యాణ్ కి దర్శకత్వం వహిస్తుంటే చూడాలని ఉంది. చూద్దాం జరుగుతుందో లేదో” అని అన్నారు . ఆయన కల సాకారం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

తాజా వార్తలు