గ్లామర్ పాత్రలలో యువతను అలరిస్తున్న కత్రిన కైఫ్ ఎప్పటి నుండో నటనకు ఆస్కారమున్న పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆమెకు అటువంటి పాత్రే ఒకటి దక్కింది. ఆమె మెహరున్నీసా పాత్రలో కనిపించబోతున్నారు. నిఖిల్ అద్వానీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్,రిషి కపూర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విశేషమేంటంటే కత్రిన ఇటు ఇరవై ఏళ్ల యువతీ గాను అటు అరవై ఏళ్ల వృద్దురాలిగాను రెండు పాత్రలు పోషించబోతున్నారు. ప్రస్తుతం షారుఖ్ తో ప్రేమ కథలో నటిస్తున్న కత్రిన ఈ చిత్రం అయిపోగానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఇప్పటి వరకు అందాల తారగానే మిగిలిన ఈ “చిక్కిని చమేలి” వృద్దురాలి పాత్రకు ఎంతవరకు సరిపోతుందో చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే.