ఎందుకంటే ప్రేమంటలో కరుణాకరన్ మాయాజాలం

రామ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలో కరుణాకరన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కరుణాకరం ప్రతి ఫ్రేంలో తన మాయాజాలాన్ని చూపించారు. ఈ చిత్రం అద్బుతంగా వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన ప్రచార పత్రాలలో రామ్ మరియు తమన్నాల కెమిస్ట్రీ అద్బుతంగా ఉంది. స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. రాధిక ఆప్టే,సుమన్ మరియు రఘుబాబు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version