స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్న చిత్రం “జులాయి” ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చెయ్యనున్నారు. ఇందులో ఇలియానా ప్రధాన పాత్ర పోషించగా రాజేంద్ర ప్రసాద్ పోలిస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యటానికి నిర్మాతలు అనుకుంటున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.