అది కేవలం ముద్దు మాత్రమే: కాజల్

అది కేవలం ముద్దు మాత్రమే: కాజల్

Published on Feb 20, 2012 12:00 PM IST

అందాల భామ కాజల్ అగర్వాల్ నటించిన ‘బిజినెస్ మేన్’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు ఆమె ఉబ్బి తబ్బుబ్బవుతుంది. బిజినెస్ మేన్ చిత్రం నాకు కొత్త ఊపిరి ఇచ్చింది. దీనికి పూరి జగన్నాధ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ చిత్రంలో మహేష్ బాబుని ముద్దు పెట్టుకున్నారు కదా ఎలా ఫీలవుతున్నారు అని అడగగా అది కేవలం కథ అవసరం మేరకు పెట్టింది మాత్రమే నిజ జీవితంలో పెట్టిన ముద్దులు కాదు అంటుంది. ఇలాంటి విషయాల్ని పెద్దది చేసి చూడొద్దు అంటుంది.

తాజా వార్తలు