నేను ఐటెం సాంగ్ లు చెయ్యను – రిచా

నేను ఐటెం సాంగ్ లు చెయ్యను – రిచా

Published on Jan 24, 2012 1:50 AM IST

రిచా గంగోపాధ్యాయ్ శేఖర్ కమ్ముల “లీడర్” చిత్రం తో పరిశ్రమ కి పరిచయమయిన ఈ భామ తరువాత “మిరపకాయ్” చిత్రం తో విజయాన్ని రుచి చూసింది కాని తమిళ పరిశ్రమ లో ఈ భామ “మయక్కం ఎన్న” మరియు “ఒస్తే ” చిత్రాలతో భారి విజయాలు అందుకుంది ప్రస్తుతం ప్రభాస్ తో “”వారధి” చిత్రం లో మరియు ఒక బెంగాలి చిత్రం లో నటిస్తుంది ఈ బెంగాలి చిత్రం తెలుగు “విక్రమార్కుడు “చిత్రానికి రిమేక్.ఒక పత్రిక సంస్థ అక్షయ్ కుమార్ నటిస్తున్న రౌడీ రాథోర్ చిత్రం లో రిచా ని ఒక పాట కోసం అడిగారని ప్రచురించింది దీనికి రిచా స్పందిస్తూ ” నన్ని రౌడీ రాథోర్ చిత్రం లో పాట చెయ్యమని ఎవరు సంప్రదించలేదు నేను కూడా ఎవరిని అడగలేదు ఇప్పట్లో ఐటం సాంగ్ లు చేసే ఆసక్తి కూడా నాకు లేదు” అని చెప్పారు ఈ మధ్యనే రామోజీ ఫిలిం సిటీ లో ఈ భామ “వారధి” చిత్ర చిత్రీకరణ లో పాల్గొన్నారు చూస్తుంటే ఈ భామ మొత్తం మూడు భాషల మీద కన్నేసినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు