ప్రకాష్ రాజ్ పెర్ఫెక్షనిస్ట్ అనే పదానికి బాగా సరిపోతారు. ఈ మధ్య ఇతనితో ఉండటం కష్టం అని వచ్చిన పుకారుకి సమాధానమిస్తూ ” తాజ్ మహల్ అక్కడే ఉంటుంది మనమే దాని దగ్గరికి వెళ్ళాలి అలానే నాకు సొంత అభిమానం ఉంటుంది నన్ని బాధపెట్టేవారికి నేను దూరంగా ఉంటాను”. ఆకాష్ మరియు రాధిక ఆప్టే ప్రధాన పాత్రలలో నటించిన ధోని చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభు దేవా ఒక చిన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు మరియు తమిళం లో ఒకేరోజు విడుదల కానుంది.