నీళ్ళు తాగకుండా షూటింగ్ లో పాల్గొన్న మంచు మనోజ్

మంచు మనోజ్ అంకిత భావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పోరాట సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు మనోజ్ తన ప్రాణాలు పెట్టి చేస్తారు. ప్రస్తుతం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్న ఈ  నటుడు జ్వరంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నారు. అది కూడా దేహం చూపించవలసిన సన్నివేశాలు కావటంతో నీళ్ళు తాగకూడదని సలహా ఇచ్చారు. దీనితో ఈ నటుడు దాదాపుగా 22 గంటలు నీళ్ళు తాగకుండా గడిపారు. ” ఇప్పుడే బేర్ బాడి సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయ్యింది. దాదాపుగా 22 గంటల తరువాత నీళ్ళు తాగుతున్నాను. ఈ రోజు చిత్రీకరణ చాలా బాగుంది రేపు ప్రొద్దున ఆరు గంటల వరకు ఈ చిత్రీకరణ జరగనుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో బాల కృష్ణ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. బొబో శశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version