ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెట్టిన హరీష్ శంకర్

harish-shankar
డైరెక్టర్ హరీష్ శంకర్ తన కెరీర్లో చేసింది 4 సినిమాలే అయినప్పటికీ అందులో ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే, ‘షాక్’ లాంటి సినిమాతో అట్టర్ ఫ్లాప్ ని కూడా టేస్ట్ చేసాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. తన కొత్త సినిమాలో పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పైనే ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం.

మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యువ హీరో నటించనున్న ఈ సినిమాకి పరుచూరి ప్రసాద్ నిర్మాత. మాములుగా హరీష్ శంకర్ అంటే పవర్ ప్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లకి, పంచ్ డైలాగ్స్ కి బాగా ఫేమస్. ఈ సినిమా కోసం హరీష్ శంకర్ సింగల్ గా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. కావున ఈ సారి విజయాన్ని అందుకుంటాడెమో చూడాలి..

Exit mobile version