ఎనేర్జిటిక్ స్టార్ రవి తేజ ఈరోజు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. భూపతి రాజు రవి శంకర్ రాజు గా 1968 జనవరి 26 న జంగంపేట లో జన్మించిన ఈ నటుడు తండ్రి ఉద్యోగ రిత్యా చిన్నతనం అంతా పలు ప్రదేశాల్లో గడిపారు. తరువాత డిగ్రీ విజయవాడ సిద్దార్థ డిగ్రీ కాలేజీ లో పూర్తి చేసారు చిన్నతనం నుండే చిత్ర పరిశ్రమ మీద ఆసక్తి ఉన్న ఈ నటుడు ముందు డిగ్రీ పూర్తవ్వగానే కృష్ణ వంశి దగ్గర “నినే పెళ్ళాడుతా” చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. “సింధూరం” చిత్రం లో చిన్న పాత్ర వేసిన రవి తేజ “నీకోసం” చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు కాని పూరి జగన్నాథ్ చేసిన “ఇడియట్” చిత్రం తో తారగా ఎదిగారు. ఆ తరువాత రవి తేజ తన కెరీర్ లో వెనక్కి చూసుకోలేదు “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” , ” నా ఆటోగ్రాఫ్ “, “ఖడ్గం “,”మిరపకాయ్” మొదలగు చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన ఎనేర్జి మరియు డైలాగు డెలివరీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలతో బిజీ గా ఉన్న రవితేజ త్వరలో “నిప్పు” చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నటుడికి 123తెలుగు.కాం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రవితేజ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
రవితేజ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
Published on Jan 26, 2012 4:26 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్‌లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


