మంచు మనోజ్ కుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మంచు మనోజ్ నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. మే 20 1983 సంవత్సరంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుండే సినిమాల పై మక్కువ పెంచుకున్నాడు. మనోజ్ తండ్రి గారైన మోహన్ బాబు తెలుగు చాలా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మనోజ్ 10 సంవత్సరాల వయసులో ఉండగా ‘మేజర్ చంద్రకాంత్’ అనే సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ‘పుణ్యభూమి నా దేశం’ మరియు ‘అడవిలో అన్న’ వంటి సినిమాల్లో కూడా బాల నటుడి పాత్ర పోషించిన మనోజ్ 2004 లో ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత రొటీన్ సినిమాలు చేస్తూ 2008 లో వచ్చిన ‘నేను మీకు తెలుసా’ సినిమాతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘బిందాస్’ సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకున్న మనోజ్ మూస సినిమాల జోలికి వెళ్ళకుండా తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకొని ‘మిస్టర్ నూకయ్య’ వంటి సినిమా చేసాడు. త్వరలో ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాతో మన ముందుకి రానున్న మనోక్ కుమార్ కి 123తెలుగు.కాం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Exit mobile version