జగపతి బాబుకి పుట్టిన శుభాకాంక్షలు

ఈ రోజు జగపతి బాబు పుట్టిన రోజు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సినిమాల్లోకి వస్తాను అని చెప్పగానే వీరమాచనేని జగపతి రావు చౌదరిని ఆయన తండ్రి గారైన రాజేంద్రప్రసాద్ చౌదరి గారు జగపతి బాబు పేరుతో ఇండస్ట్రీకి పంపించారు. జగపతి బాబు ‘సింహ స్వప్నం’ సినిమాతో తెలుగు చలచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కొద్దిగా సమయం పట్టినా 1993 లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘గాయం’ చిత్రంతో ఫేమస్ అయ్యారు. ఆయన నటించిన చిత్రాలలో గాయం, మావిచిగురు, శుభమస్తు, మావిడాకులు, ఆశయం, అంతఃపురం, శుభలగ్నం, శుభాకాంక్షలు వంటి చిత్రాలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాలలో నటిస్తున్నారు.

123తెలుగు.కామ్ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Exit mobile version