పేరు మార్చుకున్న హన్సిక

పేరు మార్చుకున్న హన్సిక

Published on Apr 24, 2012 10:39 PM IST

సిని తారలు – సంఖ్యా శాస్త్రం మధ్య బంధం ఎప్పటి నుండో తెలిసిందే. సంఖ్యా శాస్త్రం కారణంగా చాలా మంది అగ్ర తారలు వారి పేరులో అక్షరాలను చేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంత మంది పరిశ్రమలో అదే పేరుతో మరొకరు ఉండటం వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. ప్రస్తుతం హన్సిక మోత్వాని వంతు వచ్చింది. కోలోవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ భామ తన ఇంటి పేరుని వదులుకుంది. ఇన్ని రోజులు హన్సిక మోత్వానిగా పిలవబడిన ఈ భామ ఇక నుండి హన్సిక అని మాత్రమే పిలవబడుతుంది. 9 సంఖ్యా తనకి కలిసి వచ్చిందని ఈ పని చేసినట్టు తెలుస్తుంది. తన పుట్టిన రోజు కూడా 9-9-1990. ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే ఈ నిర్ణయం “ఒరు కల్ ఒరు కన్నాడి” చిత్ర విజయం తరువాత తీసుకోవడం ఇక తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు