“గబ్బర్ సింగ్” పాటల వేదిక ఖరారు

“గబ్బర్ సింగ్” పాటల వేదిక ఖరారు

Published on Apr 6, 2012 8:15 PM IST

పవన్ కళ్యాణ్ రాబోతున్న చిత్రం “గబ్బర్ సింగ్” ఆడియో విడుదల వేదిక ఖరారయ్యింది. ఈ నెల 15న ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. గతంలో ఈ చిత్ర ఆడియోని తిరుపతి,హైదరాబాద్,వైజాగ్ వంటి మూడు వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు వేదికలో చేస్తారు అని మేము ప్రకటించాం కాని తాజాగా చిత్ర వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని శిల్ప కళా వేదికలో విడుదల చెయ్యనున్నారు. ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో ఏ ఆడియో విడుదల వేడుక జరగనంత ఘనంగా ఈ వేడుకను జరిపేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నాయి. ఈ చిత్రం మీద అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు