క్లైమాక్స్ ఫైట్స్ పూర్తి చేసుకున్న “గబ్బర్ సింగ్”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గబ్బర్ సింగ్” చిత్ర పతాక పోరాట సన్నివేశాలు చిత్రీకరణ ఈరోజు పూర్తి చేసుకుంది . రామ్ – లక్ష్మణ్ పర్యవేక్షణలో జరిగిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఈ రోజుతో ముగిసింది. వచ్చే నెల 10న ఒక పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం విదేశాలకు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఏప్రిల్ మొదటి వారం లో విడుదల కానుంది.

Exit mobile version