రీ- రికార్డింగ్ పనులు పూర్తి చేసుకున్న “ఎందుకంటే ప్రేమంట”

రీ- రికార్డింగ్ పనులు పూర్తి చేసుకున్న “ఎందుకంటే ప్రేమంట”

Published on May 31, 2012 10:55 PM IST

ఈ వేసవికి విడుదల కానున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఎందుకంటే ప్రేమంట” చిత్రం రీ- రికార్డింగ్ పనులు ఈరోజు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు జి వి ప్రకాశ్ ఈ చిత్ర రికార్డింగ్ గురించి సంతృప్తిగా ఉన్నారు. యూత్ ఫుల్ హీరో రామ్ మరియు మిల్క్ బ్యుటి తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 8న విడుదలకు సిద్దమయ్యింది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఈ చిత్రం రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ చిత్రం కాబట్టి ఈ చిత్ర ఫలితం గురించి రామ్ కాస్త ఆత్రుతగా ఉన్నారు. గత చిత్రం “కందిరీగ” తో హిట్ కొట్టిన రామ్ ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు.

తాజా వార్తలు