ఈగ ట్రైలర్ కి అద్బుతమయిన స్పందన

<iframe width=”420″ height=”315″ src=”http://www.youtube.com/embed/5XFhVtB9j3Q” frameborder=”0″ allowfullscreen></iframe>

 

ఎస్.ఎస్.రాజమౌళి గ్రాఫిక్ మాయాజాలం “ఈగ” అటు ప్రేక్షకులను మరియు ఇటు విమర్శకులని ఆకట్టుకుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యి ఐదు రోజుల్లో యు ట్యూబ్ లో ఐదు లక్షలకు పైగా క్లిక్స్ ని సంపాదించుకుంది. ఆనురాగ్ కశ్యప్ మరియు శ్రీధర్ రాఘవన్ లాంటి వారు కూడా ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో మాట్లాడారు. జాతీయ పత్రికలు కూడా ఈ చిత్రం గురించి మాట్లాడటం మొదలు పెట్టాయి. కొద్ది రోజుల క్రితం రాజమౌళి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఈగ వ్యక్తిత్వం కనిపిస్తుంది” అని తెలిపారు. మరో పక్క సుదీప్,సమంత మరియు నాని లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో ఈ చిత్రం గురించి భారీగానే ప్రచారం చేస్తున్నారు. రాజమౌళి తన మొదటి అడ్డంకి తప్పించుకున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈ వేసవి లో విడుదల కానుంది.

Exit mobile version