కొత్త నటులతో నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం “ఈ రోజుల్లో” ఈ మధ్య కాలంలో పరిశ్రమలో బాగా అంచనాలున్న చిత్రం అయ్యింది. టివిలో ఈ చిత్ర ప్రచార చిత్రం పలు మార్లు ప్రదర్శిస్తుండటం, ఈ చిత్ర ప్రచారం మూలాన ఈ చిత్రం చిన్న బడ్జెట్ చిత్రమే అయిన భారీ అంచనాలను సృష్టిస్తుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముఖ్యంగా యువతను ఉద్దేశించి తీసిన చిత్రం. ప్రేమంటే రెండు బిన్న అభిప్రాయాలున్న ఇద్దరు మనుషుల మధ్య జరిగే కథే ఈ చిత్రం. శ్రీనివాస్ మరియు రేష్మ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యుసర్ గా ఉండగా గుడ్ సినిమా గ్రూప్ మరియు మారుతి మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. జేబి సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది.