గుడ్ ఫ్రెండ్స్ సినిమా గ్రూప్ బ్యానర్ పై నిర్మించి గత శుక్రవారం విడుదలైన ‘ఈ రోజుల్లో’ చిత్రం హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ఏరియాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్ర సమీక్షలు బావుందని చెప్పడం, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడంతో ప్రేక్షకులందరి దృష్టి ఈ చిత్రం పై పడింది. ఈ సినిమా చూసిన ప్రతి వారు కూడా బావుందని చెప్పడంతో మౌత్ టాక్ ద్వారా హిట్ టాక్ సంపాదించుకుంది. హైదరాబాదులోని పలు ఏరియాల్లో టికెట్స్ దొరకడం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. హైదరాబాదులోనే కాకుండా మిగతా ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. 75 లక్షలతో తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ సాంకేతిక విలువలు ఉన్నతంగా ఉండటంతో, 5డి కెమెరాతో తీసి రామ్ గోపాల్ వర్మ వంటి విలక్షణ దర్శకుడి ప్రశంసలు సైతం అందుకుంది. ఈ చిత్ర దర్శకుడు మారుతికి మరో పెద్ద సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం కూడా గమనార్హం. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు.
హైదరాబాదులో సంచలనం సృష్టిస్తున్న ‘ఈ రోజుల్లో’
హైదరాబాదులో సంచలనం సృష్టిస్తున్న ‘ఈ రోజుల్లో’
Published on Mar 25, 2012 2:31 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్
- ‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!