చిత్ర పరిశ్రమను దక్షిణ మరియు ఉత్తర పరిశ్రమలుగా విడదీయటంలో శ్రియ వ్యతిరేకం.ఈ విషయం పై శ్రియ మాట్లాడుతూ “మనమంతా భారతీయులం అన్ని ప్రాంతాలు మనవే అనుకోవాలి అన్ని ప్రాంతాల చిత్ర పరిశ్రమలు కూడా మనవే అనుకోవాలి అంతే కాని ఇలా ప్రాంతాల వారిగా విడదీయటం సరికాదు” అని అన్నారు. “నాకు అన్ని భాషలలో అవకాశాలు రావటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి భాష లో ను ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు భారతీయ చిత్ర నాణ్యతను పెంచటానికి కృషి చేస్తున్నారు” అనిఅన్నారు. శ్రియ ఇలా చెప్పటానికి కారణం ఏంటో కాని ఇలా చెప్పటం అభినందనీయం.