ప్రత్యేకం: దరువు నైజాం హక్కులు దక్కించుకున్న దిల్ రాజు

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘దరువు’ చిత్రానికి సంభందించిన నైజాం డిస్ట్రిబ్యుషన్ హక్కులు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. మా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు 5 కోట్ల రూపాయలకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. రవి తేజకు నైజాం ఏరియాలో మంచి అమౌంట్ అని చెప్పుకోవాలి. దరువులో రవితేజ సరసన తాప్సీ నటిస్తుండగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ అంటోనీ సంగీతం అందించాడు.దరువు మే 4న విడుదలకు సిద్ధమవుతుంది.

Exit mobile version