సమంత చేస్తుంది అని దృవీకరించిన దిల్ రాజు

సమంత చేస్తుంది అని దృవీకరించిన దిల్ రాజు

Published on Dec 30, 2011 8:20 PM IST

దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమ లో దశాబ్దాల తరువాత నిజమయిన మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సమంత చేస్తుంది అని చెప్పి అన్ని పుకార్లకు తెరదించారు. గతం లో డేట్స్ కుదరక సమంత ఈ చిత్రం నుండి తప్పుకున్నది అని పుకారు నడిచింది. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమంత మహేష్ కి జోడీగా నటిస్తుండగా అమలా పాల్ వెంకటేష్ కి మరదలి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం ఇందులో మహేష్ బాబు వెంకటేష్ లు అన్నదమ్ములు గ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు