యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు త్రిష జంట గా నటిస్తున్న చిత్రం ‘దమ్ము’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాలలో శరవేగం గా జరుగుతోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అ.వల్లభ నిర్మాత. కీరవాణి ఈ చిత్రానికి బాణీలు అందించారు. ఈ చిత్రానికి కార్తీక రెండవ హీరోయిన్. సీనియర్ నటి భానుప్రియ ఈ చిత్రం లో ఎన్.టి.ఆర్ కి తల్లి గా నటిస్తున్నారు. కామెడి హీరో వేణు ఒక ప్రత్యేకమైన పాత్ర పోస్తిస్తున్నారు.
పూర్తి కమర్షియల్ సినిమా గా రూపొందుతున్న దమ్ము పై భారీ అంచనాలే ఉన్నాయి.వచ్చే వేసవి కాలానికి దమ్ము విడుదల అవుతుంది.