అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గురువారం రాత్రి కన్నుమూశారు. వివిధ భాషల్లో దాదాపు 135 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తొంబై ఏళ్ళు నిండిన ఆయన గురువారం రాత్రి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. డాక్టర్ వచ్చేలోపు తుది శ్వాస విడిచారు. ‘నారద నారది’ చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన దక్షణామూర్తి గారు సంసారం చిత్రంతో ప్రాచుర్యం పొందారు. లతామంగేష్కర్తో తొలిసారి తెలుగులో పాడించిన ఘనత ఈయనకే దక్కుతుంది.సంతానం చిత్రం కోసం లతా మంగేష్కర్ గారితో ‘నిదురపోరా తమ్ముడా…’ అనే పాటను పాడించారు. దాసి, అన్నపూర్ణ, నర్తనశాల, శ్రీమద్విరాట్ పర్వం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ఇలా పలు చిత్రాలకు సంగీతం అందించారు.