సాధారణం గా ఒక హీరోయిన్ 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగడం చాలా అరుదైన విషయం. చార్మి ఇందుకు మినహాఇంపు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో పాత్రలు పోషిస్తూ వస్తున్న చార్మికి ఇప్పటికి కొంతమంది దర్శకనిర్మాతల దగ్గర్నుంచి కొన్ని పాత్రలు వస్తున్నాయి. చార్మి తాజా చిత్రం ‘ప్రతిఘటన’ తనకి 50వ చిత్రం కాగా తను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధం గా వున్నానని తెలిపింది.
“కేవలం గ్లామర్ మీద దృష్టి పెడితే మన కెరీర్ రెండు మూడు ఏళ్ళకన్నా ఎక్కువ సేపు కొనసాగదు. కేవలం గ్లామర్ మీదే దృష్టి పెట్ట కుండా వుంటే చాలా సంవత్సరాలు కొనసాగొచ్చు. అంతే కాకుండా మీరు లేడీ ఓరియెంటెడ్ పాత్ర చేసినా ఐటెం సాంగ్ చేసినా ప్రేక్షకులకి కేవలం వినోదం కావలి. నేను వాళ్ళని అలరించడానికి ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం” అని ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చార్మి తెలిపింది. ఆమె ఇన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగడంలో ఆశ్చర్యం లేదు
.
తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ప్రతిఘటన’ లో చార్మి ఒక జర్నలిస్ట్ గా ముఖ్యపాత్ర పోషిస్తుంది. రేష్మ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18 న విడుదల కానుంది.