టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళికి తన రాబోయే సినిమా ‘బాహుబలి’ కోసం నటీనటులను సెలక్ట్ చెయ్యడం కాస్త కష్టతరంగా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వీళ్ళు కాకుండా ఈ సినిమాకి కావలసిన మిగతా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది అందులో భాగంగానే ఈ సంవత్సరం మొదట్లో టాలెంట్ హంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ టాలెంట్ హంట్ కి అనూహ్యమైన స్పందన లబించింది. సుమారు 20,000 మందికి పైగా ఈ కాంటెస్ట్ కి ఎంట్రీలు పంపారు. సుమారు మూడు నెలలు అన్నీ చెక్ చేసి కొంత మందిని ఫైనలైజ్ చేసారు, ఆ తరవాత జరిగిన సంఘటనలు రాజమౌళిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
ప్రస్తుత స్టేటస్ ని తెలియజేస్తూ ఎంట్రీలు పంప[ిన వారిలో చాలా అమంది ఆడిషన్స్ కి రాలేదు, సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ కి రాలేదని అన్నారు. ‘ గత నెలలో మొత్తం 2000 మందిని సెలెక్ట్ చేసి ఆడిషన్స్ కి రామ్మన్నాము కానీ అందులో సగం మందే వచ్చారు, వచ్చిన వారిలో నుంచి 50 మంది సెలెక్ట్ చేసాము అందులో రెండు రోజులు ట్రైనింగ్ ముగిసే సరికి సగం మంది కనపడకుండా పోయారు. 13,000 మందిలోనుంచి 2000 మంది సెలెక్ట్ చేయడం కష్టమైన పని అంతమందిని మానేజ్ చెయ్యలేకపోయాం సెలెక్ట్ చెయ్యని వారు మన్నించాలని’ రాజమౌళి ట్వీట్ చేసారు.
అలాగే ‘ నాకు తెలిసిన దాని ప్రకారం మనదగ్గర టాలెంట్ ఉందని హార్డ్ వర్క్ చేస్తామని ఆఫర్స్ రావు. నటీనటుల ఎంపిక విషయానికి వచ్చేటప్పటికి ఆ పాత్రకి మనం సరిపోతామా లేదా అనే దాన్ని బట్టే ఆఫర్స్ వస్తాయి. అలా అని టాలెంట్ హార్డ్ వర్క్ అవసరం లేదని కాదు, ఒక సినిమాకి న్యాయం చెయ్యాలంటే ఈ మూడు ఉండాలని’ కూడా రాజమౌళి రాజమౌళి ట్వీట్ చేసారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని కె రాఘవేంద్ర రావు గారి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.