నిన్న ఇక్కడ నోవటేల్ హోటల్ లో “బిజినెస్ మాన్” విజయోత్సవ సభ జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ పెద్ద్దలు హాజరు అయ్యారు. వారి మాటలు మీకోసం….
ఎస్.వి.కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ” మహేష్ బాబు స్థాయి పెరిగింది ఇప్పుడు అయన తన విజయాన్ని అందరితో పంచుకుంటున్నారు తండ్రి నుండి “సంస్కారం” నేర్చుకున్నారు. ఇలానే మరిన్ని విజయాలు సాదించాలని కోరుకుంటున్నా”.
ఆది శేషగిరి రావు మాట్లాడుతూ ” మహేష్ బాబు 75 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేస్తా అని చెప్పినపుడు నేను నమ్మలేదు కాని నేను తప్పు అని తను నిరూపించాడు. ఈ చిత్రం తెలుగు చిత్ర స్థాయి ని పెంచింది పూరి తన శైలి ని చూపించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు”
దాసరి నారాయణ రావు ” రామ్ గోపాల్ వర్మ నా శిష్యుడే కాని ఎప్పుడు నాతో కలిసి పని చెయ్యలేదు ఇలాంటి విజయాన్ని సాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బిజినెస్ మాన్ చిత్రం పరిశ్రమ కి పండగల వచ్చింది గతం లో “మోసగాళ్ళకు మోసగాడు” మరియు “అల్లూరి సీతా రామ రాజు” చిత్రాలు 28 రోజుల్లో చిత్రీకరించారు మంచి కథకి మంచి నటులు తోడయితే చిత్ర విజయం వస్తుంది కాని కాలాన్ని బట్టి కాదు. చిత్ర పరిశ్రమ రికార్డ్ ల ను మూడు సార్లు బద్దలు కొట్టిన ఒకే ఒక కథానాయకుడు మహేష్ బాబు ఈ చిత్రం లో తన అందంతో పాటు నటనతో అందరిని ఆకట్టుకున్నారు”
సూపర్ స్టార్ కృష్ణ “ఈ చిత్రాన్ని చుసినపుడే చరిత్ర సృష్టిస్తుంది అనుకున్నాను మహేష్ బాబు డైలాగు లు జనం లో కి వెళ్ళాయి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తు లో కూడా పూరి మరియు మహేష్ బాబు కలయిక లో చిత్రాలు రావాలని కోరుకుంటున్నా విదేశాల్లో మహేష్ తెలుగు చిత్ర మాకెట్ ని పెంచాడు ఈ విష్యం నాకు చాలా గర్వం గా ఉంది”.
దిల్ రాజు ” ఇలా తక్కువ రోజుల్లో పూర్తయిన చిత్రం పరిశ్రమ కి మంచి చేస్తుంది మొదటి నుండి ఈ చిత్రం విజయం సాదించాలని కోరుకున్నా మరింత మంది దర్శకులు ఇలా తొందరగా చిత్రాలు ముగించడానికి ప్రయత్నించాలి అప్పుడే మన పరిశ్రమ బాగా అబివృద్ది చెందుతుంది”
రామ్ గోపాల్ వర్మ ” ఈ చిత్ర విజయానికి పూర్తి కారణం పూరి జగన్నాథ్ నేను ఆలోచన్ అమాత్ర్హమే ఇచ్చాను పూరి మొత్తం చేసాడు పూరి మరియు మహేష్ బాబు లకి శుభాకాంక్షలు ఈ చిత్రాన్ని ఇంత ఆసక్తికరంగా తీసినందుకు భారత దేశం మహేష్ బాబు కూడా ఒక మంచి నటుడు చిత్రం మొతం ఆసక్తికరంగా ఉండేలా నటించారు”
మహేష్ బాబు,పూరిజగన్నాథ్,కాజల్ కార్యక్రమానికి హాజరయిన పెద్దలకు మరియు చిత్రాన్ని ఇంత భారి విజయం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు .